invitation | మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం…

invitation | మహాశివరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం…

  • జగ్గయ్యపేటలో ఈఓ కానూరి సురేష్ బాబు మర్యాదపూర్వక భేటీ

invitation | జగ్గయ్యపేట, ఆంధ్రప్రభ : మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆలయ ఈఓ కానూరి సురేష్ బాబు శుక్రవారం జగ్గయ్యపేట పట్టణంలోని శాసనసభ్యుడు శ్రీ రాం రాజగోపాల్ (తాతయ్య)ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిర్వహించనున్న మహాశివరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకు అధికారికంగా ఆహ్వానించారు. అనంతరం మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని రూపొందించిన వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే శ్రీ రాం రాజగోపాల్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ ఏడాది ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శైవ సంప్రదాయాలకు అనుగుణంగా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈఓ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేసీపీ రాంప్రసాద్ సహా పలువురు ఆలయ కమిటీ సభ్యులు, ప్రముఖులు పాల్గొన్నారు.

Leave a Reply