TG | మీ ఇంటి బిడ్డగా భావించి ఆశీర్వదించండి..

TG | మీ ఇంటి బిడ్డగా భావించి ఆశీర్వదించండి..
- సమస్యలకు శాశ్వత పరిష్కారం
- బీఆర్ఎస్ 9వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ
TG | పరకాల, ఆంధ్రప్రభ : పట్టణంలోని 9వ వార్డ్ ఓటర్లు మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించాలని, వార్డులోని సమస్యలను శాశ్వత పరిష్కారం చేస్తానని బీఆర్ఎస్ 9వ వార్డు అభ్యర్థి బండారి కవిత కృష్ణ ఓటర్లను కోరారు. పట్టణంలోని 9వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి కవిత కృష్ణ ఆధ్వర్యంలో ఇంటింటి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గతంలో రాజకీయ అనుభవంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. వార్డులో ఇంటింటా పర్యటిస్తూ ప్రజలను ఆప్యాయంగా పలకరించి, ఓటర్ల మద్దతు కోరారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అభ్యర్థి బండారి కవిత కృష్ణ అన్నారు. అభ్యర్థి వెంట బీఆర్ఎస్ నాయకులు, నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
