Raipole | పదో తరగతి ప్రతిభకు భారీ ప్రోత్సాహకం

Raipole | పదో తరగతి ప్రతిభకు భారీ ప్రోత్సాహకం

  • స్టేట్ టాపర్‌కు రూ.5 లక్షలు.
  • జిల్లా టాపర్ కు రూ.2 లక్షలు.
  • మండల టాపర్ కు రూ.10 వేలు.

Raipole | రాయపోల్, ఆంధ్ర‌ప్ర‌భ : రాయపోల్ మండల పరిధిలో పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని గ్రామ సర్పంచ్ మాసాన్‌పల్లి రాజు పేర్కొన్నారు. సోమవారం రాయపోల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విద్యే జీవితానికి బలమైన పునాదని, పేద–ధనిక తేడా లేకుండా విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు చేరుకోవచ్చన్నారు.ప్రతిభను గుర్తించి ఇలాంటి భారీ ప్రోత్సాహకాలు అందించడం వల్ల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.రాయపోల్ మండలం నుంచి రాష్ట్ర,జిల్లా,మండల స్థాయిలో టాపర్లు కావాలని ఆకాంక్షించారు. స్టేట్ టాపర్‌కు రూ.5 లక్షలు,సెకండ్ బహుమతిగా రూ.3 లక్షలు, జిల్లా టాపర్‌కు రూ.2 లక్షలు, నియోజకవర్గ టాపర్‌కు రూ.1 లక్ష,మండల టాపర్‌కు రూ.10 వేల నగదు బహుమతి అందజేస్తామని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు వెల్లడించారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని నిరంతర కృషితో చదువులో ముందుకు సాగాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ హన్మంతు రాజు, శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతినిధులు జి. కుమార్,మహేష్, శ్రీనివాస్, ఇన్చార్జి హెచ్ఎం నర్సింగా రావు, అశోక్ తదితరులు పాల్గొన్నారు.