Megastar| బాబీ సినిమా ఆలస్యం వెనుక అసలు కారణం..?

Megastar| బాబీ సినిమా ఆలస్యం వెనుక అసలు కారణం..?

  • సంక్రాంతి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నెక్ట్స్ మూవీ ఎందుకు ఆగింది?
  • కేవీఎన్ ప్రొడక్షన్స్ ఎదుర్కొంటున్న లీగల్, ఆర్థిక సమస్యలు
  • జన నాయగన్ కేసు ప్రభావం చిరు సినిమాపై పడిందా?
  • చిరు–బాబీ ప్రాజెక్ట్ మరో నిర్మాత చేతుల్లోకి వెళ్లే ఛాన్స్
  • వాల్తేరు వీరయ్య కాంబోపై ఉన్న భారీ క్రేజ్
Megastar

Megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ గారు అంటూ వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఇచ్చిన బ్లాక్ బస్టర్ జోష్ తో.. నెక్ట్స్ మూవీ స్టార్ట్ చేయాలి అనుకున్నారు. ఈపాటికే చిరు నెక్ట్స్ మూవీ (Movie) సెట్స్ పైకి రావాలి కానీ.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. ఇప్పుడు కొత్తగా చిరు మూవీ నిర్మాత మారబోతున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చిరుతో సినిమాను ఏ నిర్మాత వదులకుంటారు..? అసలు ఇలా వార్తలు రావడానికి కారణం ఏంటి..? అసలు ఏం జరిగింది…?

Megastar

Megastar| చిరు, బాబీ..

ఈ సక్సెస్ ఫుల్ కాంబోని కన్నడ నిర్మాత, కేవీఎన్ ప్రొడక్షన్స్ అధినేత కె.నారాయణ నిర్మించనున్నారు. అయితే.. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన లేటెస్ట్ మూవీ (Latest Movie) జన నాయగన్. ఇది కోలీవుడ్ స్టార్ విజయ్ ఆఖరి సినిమా. ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. బిజినెస్ కూడా వావ్ అనిపించేలా జరిగింది. అయితే.. ఊహించని విధంగా ఈ సినిమాకి సెన్సార్ కష్టాలు వచ్చాయి. దీంతో సంక్రాంతికి థియేటర్స్ లోకి రావాల్సిన ఈ మూవీ ఆగిపోయింది. కోర్టుకు వెళ్లినా ఈ మూవీ మాత్రం రిలీజ్ కావడం లేదు.

Megastar

Megastar| మూడు నాలుగు నెలలు షూటింగ్..

ఈ మూవీకి భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే.. ఇప్పుడు ఆ అగ్రమెంట్స్ క్యాన్సిల్ అవుతున్నాయట. ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్లు వెనక్కి తగ్గుతున్నారట. దీంతో వారికి అమౌంట్ రీఫండ్ చేస్తున్నారట నిర్మాత. బయ్యర్లకు, థియేటర్లకు చెల్లింపులు చేస్తున్నారట. పైగా సినిమా మూడు నాలుగు నెలలు షూటింగ్ లో ఆలస్యం అవ్వడం వలన భారీగా వడ్డీల భారం పడుతుందట. మొత్తంగా ఈ సినిమా భారీ నష్టమే మిగిల్చేలా కనిపిస్తుందట. దీంతో కేవీఎన్ (KVN) సంస్థకు నిధుల సమస్య తలెత్తుందని టాక్ వినిపిస్తోంది. ఇలా జన నాయగన్ లీగల్ వ్యవహారాల్లో నిర్మాత ఉంటే.. ఇప్పుడు టాక్సిక్ రిలీజ్ కి రెడీ చేయాల్సివుంది. దీని బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలి.

Megastar

Megastar | ఈ ప్రాజెక్ట్ ను మరో నిర్మాతకు అప్పగించే ఛాన్స్..

అందుకనే.. చిరు,(Chiru) బాబీ సినిమా ఈపాటికే సెట్స్ పైకి రావాల్సింది ఇంకా రాలేదని టాక్ వినిపిస్తోంది. ఈ సంస్థ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండడంతో ఈ సినిమాని మరింత ఆలస్యంగా స్టార్ట్ చేస్తారని ఓ వైపు ప్రచారం జరుగుతుంది. మరో వైపు ఈ ప్రాజెక్ట్ ను మరో నిర్మాతకు అప్పగించే ఛాన్స్ ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. చిరు, బాబీ కాంబోలో రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆ కాంబోలో రూపొందే మూవీ కావడంతో క్రేజ్ బాగా ఉంది. అందుచేత కేవీఎన్ సంస్థ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే.. వేరే నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ ను తీసుకోవడానికి రెడీగా ఉంటారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ చేతులు మారుతుందా..? లేదో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

CLICK HERE TO READ ప్లాన్ ఫలించేనా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply