17వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా..

17వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తా..

  • బీఆర్ఎస్ పార్టీ 17వ వార్డు అభ్యర్థిగా శనిగరం రజిని నవీన్

పరకాల, ఆంధ్రప్రభ : పూర్వ అనుభవంతో పరకాల పురపాలక సంఘం 17వ వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని బీఆర్ఎస్ పార్టీ 17వ వార్డు అభ్యర్థి మాజీ కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్ వార్డులోని ఓటర్లకు తెలియజేశారు. శనివారం పరకాల పురపాలక సంఘం 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మాజీ కౌన్సిలర్ శనిగరం రజిని నవీన్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ రజిని నవీన్ మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. పురపాలక సంఘం మాజీ కౌన్సిలర్ గా ఉన్న అనుభవంతో ప్రజా సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మాజీ కౌన్సిలర్ శనిగరం రజని నవీన్ వెంట శ్రీ కుంకుమేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ చందుపట్ల నరసింహారెడ్డి, మాజీ కౌన్సిలర్ పాలకుర్తి గోపి, బిఆర్ఎస్ నాయకులు చట్ల వెంకటేశ్వర్లు, మహమ్మద్ అల్తాఫ్ తదితరులు ఉన్నారు.

Leave a Reply