Police | రోడ్డు ప్రమాదాల నివారణ కోసం..

Police | రోడ్డు ప్రమాదాల నివారణ కోసం..
Police, మచిలీపట్నం, ఆంధ్రప్రభ : జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అడ్డగింపు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, కృష్ణా జిల్లా పోలీసు అధికారులు ప్రత్యేక వాహనాల తనిఖీలు, విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు.
ఈ తనిఖీల సందర్భంగా అన్ని రకాల వాహనాలను ఆపి తనిఖీలు చేసి, డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, ఇన్షూరెన్స్ తదితర పత్రాలు పరిశీలించారు. హెల్మెట్ లేనివారికి, మోటార్ వెహికల్ యాక్ట్ ఉల్లంఘించిన వారికి చలాన్లు విధించారు. అదే విధంగా, మద్యం సేవించి వాహనం నడుపుతున్న వారి వాహనాలు సీజ్ చేసి కేసు నమోదు చేశారు.
