Sammakka | పూరేడు గుట్ట మినీ మేడారంలో…

Sammakka | పూరేడు గుట్ట మినీ మేడారంలో…

  • మొక్కులు చెల్లించుకున్న భక్తులు…

Sammakka | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ జిల్లా చిట్యాల మండలంలోని వెంచరామి, కాల్వపల్లి గ్రామాల శివారు పూరేడు గుట్ట సమ్మక్క- సారాలమ్మ మినీ మేడారం జాతరలో ఈ రోజు రెండో రోజు సమ్మక్క తల్లి ప్రధాన పూజార్ల మధ్య పూరేడు గుట్ట నుండి సమ్మక్క గద్దెకు చేరుకుంది. దీంతో భక్తులు భారీ సంఖ్యలో బెల్లం, పసుపు, కుంకుమ, టెంకాయలతో మొక్కలు చెల్లించుకుంటున్నారు.

ఈనెల 28 నుండి31 వరకు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగనుంది. కాగా పూరేడు గుట్ట మినీ మేడారం జాతరకు ప్రభుత్వం నుండి భక్తులకు అన్ని వసతులు కల్పించినట్లు ఎమ్మెల్యే ఉత్సవ కమిటీ తెలిపారు. సమ్మక్క రాకతో పూరేడు గుట్ట జాతర జనసంద్రంగా మారింది .

Sammakka |
Sammakka |

click here to read more : Minister | కుటుంబ స‌మేతంగా అమ్మ‌వార్ల ద‌ర్శ‌నం….

click here to read more :