Nirmal Rural | క్రీడలతో పాటు విద్యలో రాణించాలి

Nirmal Rural | నిర్మల్ రూరల్, ఆంధ్రప్రభ : నేటి పోటీ ప్రపంచంలో అన్ని రంగాల్లో రాణించాలంటే ముఖ్యంగా విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణిస్తే మానసిక ఉల్లాసం కలిగి అన్ని రంగాల్లో దూసుకుపోవచ్చు అని నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి పిలుపునిచ్చారు. వెంగాపేట్ గ్రామంలో గురువారం మండల స్థాయి సీఎం కప్పు కప్ క్రీడల పోటీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆర్డీవో రత్న కళ్యాణి. ఆత్మ కమిటీ చైర్మన్ రామ్ రెడ్డిలు హాజరై వారు మాట్లాడారు.
చీఫ్ మినిస్టర్ మండల స్థాయి క్రీడల పోటీలు నేటి నుండి ఈ నెల 31 వరకు జరగనున్న క్రీడల పోటీలలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధి కొరకు అనేక నిధులు కేటాయిస్తుందని వాటిని సద్విని పరుచుకొని రాష్ట్రంలోనే విద్యారంగంలో నిర్మల్ జిల్లా ప్రథమ స్థాయిలో ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎంపీఓ శ్రీనివాస్. వివిధ పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
