Election | ప్రచారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..

Election | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ నియోజకవర్గంలోని ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉదయం రాజ బొల్లారం, రాజా బొల్లారం తండాలలో ప్రచారం, రోడ్ షోలలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని మల్లారెడ్డి అందరిని కోరడం జరిగింది. ఈ ప్రచారంలో భాగంగా కార్నర్ మీటింగ్ లు నిర్వహించడం జరిగింది.

మల్లారెడ్డి మాట్లాడుతూ… మా కెసిఆర్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో తండాలన్నీ గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత మా కేసీఆర్ మా ప్రభుత్వందే అని కొనియాడారు. నీళ్లు సరిగ్గా వస్తలేవు, కరెంటు సరిగ్గా వస్తలేదనీ, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన, గడిచిన రెండు సంవత్సరాల నుండి ప్రజలు నీళ్లకు, కరెంటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం గద్దనెక్కాలని ఈ మున్సిపల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ అన్ని చైర్మన్ పీఠాలు కైవసం చేసుకోవాలన్నారు.
ఈ తాండ వాసులందరు బీఆర్ఎస్ పార్టీ నుండి బలపరిచిన అభ్యర్థిని భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని మల్లారెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి వెంకటరెడ్డి, మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి చామకూర మహేందర్ రెడ్డి, మేడ్చల్ మాజీ జిల్లా గ్రంథాలయ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండలం బీఆర్ఎస్ అధ్యక్షుడు దయానంద్ యాదవ్, ముద్దుల శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు..
