Distribution | ప్రజా పంపిణీలో ఆలసత్వం క్షమార్హం కాదు

Distribution | ప్రజా పంపిణీలో ఆలసత్వం క్షమార్హం కాదు
Distribution | చండూర్, ఆంధ్రప్రభ : ప్రజా పంపిణీ వ్యవస్థలో అలసత్వం, నిర్లక్ష్యం క్షమార్హం కావని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డి.టీ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం నాడు ఆయన చండూరు పౌర సరఫరాల సంస్థ గిడ్డంగి ని తనిఖీ చేశారు.ఈ సందర్చంగా రఘునందన్ మాట్లాడుతూ, నిర్ణీత గడువులో గా చౌక దుకాణాలకు స్టాక్ చేరవేయాలన్నారు.
గిడ్డంగిలో ఉన్న స్టాక్ వివరాలను రికార్డుల్లో పొందుపరచడంలో నిర్లక్ష్యం గా ఉన్న గిడ్డంగి ఇన్ ఛార్జ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సార్ హమాలీలు మాట వినటం లేదు అని గోడౌన్ ఇన్ ఛార్జ్ ఫిర్యాదు చేయగా లిఖిత పూర్వకంగా రాసి ఇవ్వాలని తగు చర్యకు సిఫారసు చేస్తానని రఘునందన్ స్పష్టం చేశారు.
