TG | ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర

TG | ఘనంగా ప్రారంభమైన మేడారం మహాజాతర

​TG | మేడారం వాజేడు, ఆంధ్రప్రభ : అశేష భక్తజన సందోహం నడుమ ములుగు జిల్లా మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహాజాతర బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. జాతర తొలిరోజు ఆచారాల ప్రకారం కన్నెపల్లి నుంచి సారలమ్మ దేవత గద్దెపైకి రాకతో మహాజాతర అంకురార్పణ జరిగింది.

​ముఖ్య విశేషాలు :

​గద్దెల శుద్ధీకరణ : బుధవారం ఉదయం 11:00 నుండి 12:00 గంటల మధ్య సమ్మక్క, సారలమ్మ పూజారులు గద్దెల వద్దకు చేరుకుని పుట్టమన్నుతో గద్దెలను అలికి శుద్ధి చేశారు.

​ఆదివాసీ సంప్రదాయం : గొట్టు గోత్రాల ప్రకారం, ఆదివాసీ సాంప్రదాయ పద్ధతుల్లో పీఠ ముగ్గులు వేసి అమ్మవార్లకు పసుపు, కుంకుమ, చీర సారెలను సమర్పించి ధూప దీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

TG

​సారలమ్మ రాక : సాయంత్రం 5:00 నుండి 6:00 గంటల సమయంలో కన్నెపల్లి నుంచి హనుమంతుని రక్షా కవచం (నీడ) లో సారలమ్మ దేవత బయలుదేరి, రాత్రి 9:00 నుండి 10:00 గంటల మధ్య మేడారం గద్దెలకు చేరుకున్నారు.

TG

​దేవతల ఆగమనం : అదేవిధంగా కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్ద రాజులను పూజారులు మేడారం గద్దెలపైకి తీసుకువచ్చి ప్రతిష్టించారు.

​కళ్యాణ మహోత్సవం : మాఘ శుద్ధ పౌర్ణమి వెన్నెలలో సమ్మక్క అమ్మవార్లకు, పగిడిద్ద రాజులకు ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

​ఈ సందర్భంగా మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. భక్తులందరూ అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని, ప్రభుత్వం మరియు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని తెలిపారు.

Leave a Reply