Gold | ఇలా అయితే.. ఎలా కొంటాం..?

Gold | ఇలా అయితే.. ఎలా కొంటాం..?
- కొండెక్కిన బంగారం, వెండి ధరలు
- బెంబేలెత్తుతున్న విక్రయదారులు
Gold | బంగారం, వెండి ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకూ కొండెక్కి కూర్చుంటున్నాయి. ఒక్క రోజు అయినా తగ్గుతాయేమో అంటే.. తగ్గేదేలే అంటున్నాయి. పసిడి- వెండి రేట్లు పైపైకి దూసుకెళ్తుండటంతో విక్రయదారులు కళ్లు తేలేస్తున్నారు. ధరల దూకుడు ఇలా కొనసాగితే మున్ముందు బంగారం, వెండిని కొనలేమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెబ్డెస్క్ ,ఆంధ్రప్రభ :

ఇవాళ వెండి ధర కొత్త రికార్డ్ సృష్టించింది. తులం బంగారంపై రూ.3 వేలు పెరిగితే, కిలో వెండి ఏకంగా రూ.4 లక్షలకు చేరుకుంది. హైదరాబాద్లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. జనవరి 28న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే 24 క్యారట్ గోల్డ్ ధర ఏకంగా రూ.3,220 పెరిగి రూ.1,61,950 నుంచి రూ.1,65,170కి చేరుకుంది. ఇక ఆభరణాల తయారీకి వాడే 22 క్యారట్ గోల్డ్ 10 గ్రాములపై రూ.2,950 పెరిగి రూ.1,48,450 నుంచి రూ.1,51,400కి చేరుకుంది. ఇక 18 క్యారట్ గోల్డ్ ధర రూ.2,420 పెరిగి రూ.1,21,460 నుంచి రూ.1,23,880కి చేరుకుంది.

మరోవైపు వెండి ధర కూడా భారీగా పెరిగింది. ఇవాళ కిలో వెండిపై ఏకంగా రూ.13,000 పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి రూ.4,00,000కి లభిస్తోంది. తులం వెండి రూ.4,000కి కొనొచ్చు. జనవరిలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. కేవలం 28 రోజుల్లో స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.30,280 పెరగగా, 22 క్యారట్ బంగారం ధర రూ.27,750 పెరిగింది. ఇక కిలో వెండి ఏకంగా రూ.1,43,000 పెరిగింది. అతి తక్కువ కాలంలో బంగారం, వెండి ధరలు ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే మొదటిసారి.

