Indervelly | ఘనంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు

Indervelly | ఘనంగా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు

Indervelly | ఇంద్ర‌వెల్లి, ఆంధ్రప్రభ : ఇంద్రవెల్లి మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు మండల కేంద్రంలోని స్థానిక త‌హ‌సిల్దార్‌ కార్యాలయం నందు స్థానిక తహసిల్దార్ ఎం ప్రవీణ్ జవాన్లకు సలామీ ఇచ్చి జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గేడమ్ స్వాతి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఆమె గణతంత్ర దినోత్సవం పై పలు సందేశాలు అవగాహన కల్పించారు.. ఈ సందర్భంగా డిప్యూటీ తహసిల్దార్ బానోత్ రమేష్ పాల్గొన్నారు. స్థానిక మార్కెట్ యందు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉత్తం, గణతంత్ర దినోత్సవ జెండాను ఎగరవేశారు, అలాగే, మేజర్ గ్రామపంచాయతీ యందు సర్పంచ్ రాథోడ్ మోహన్ జండా ఎగరవేశారు స్థానిక పోలీస్ స్టేషన్ నందు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఈ సాయన్న పలు పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు, కాలేజీ యందు ప్రిన్సిపల్, గ్రామ పంచాయతీలలో సర్పంచులు ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులచే ప్రభాత ఫేరీ నిర్వహించి ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగరవేశారు.

Leave a Reply