Pedana | ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు

Pedana | పెడన , ఆంధ్రప్రభ : మున్సిపల్ స్థలాల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పెడన మున్సిపల్ కమిషనర్ కొండయ్య హెచ్చరించారు. పట్టణ అభివృద్ధికి, ప్రజా సౌకర్యాలకు భంగం కలిగించే అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల పెడన పట్టణంలోని 15వ వార్డు, ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి అక్రమంగా నిర్మించిన డ్రైనేజీని గుర్తించిన అధికారులు శుక్రవారం తొలగింపు చర్యలు చేపట్టారు.
