Telangana | ఎంపీడీవోకు వినతి..

Telangana | ఎంపీడీవోకు వినతి..
Telangana, చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ క్యాబిన్ లో పంచాయతీరాజ్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా వేసిన ఉపసర్పంచ్ కుర్చీ ని తొలగించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ గిర్కటి నిరంజన్ గౌడ్ ఎంపీడీవో సందీప్ కుమార్ కు వినతిపత్రం ను అందజేశారు.
ఉప సర్పంచ్ కూడా సర్పంచ్ క్యాబిన్ లో కుర్చీ వేసుకోవడానికి పంచాయతీరాజ్ చట్టంలో ఒకవేళ నిబంధన ఉంటే తనకు ఆ జీవో కాపీని ఇవ్వాలని ఎంపీడీవోను సర్పంచ్ కోరారు. అదే విధంగా డిపిఓ, డిఎల్పిఓ లకు కూడా వినతి పత్రాలను అందజేసినట్లుగా సర్పంచ్ నిరంజన్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
