Nandyal Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..

Nandyal Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం..
Nandyal Road Accident, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపు తప్పింది. దీంతో అవతలి వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. పలువురుకు గాయాలు అయ్యాయి. వీరిని హాస్పటల్ కి తరలించారు.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. 36 మంది ప్రయాణికులతో ఓ ప్రైవేట్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళుతుంది. బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం శిరిమెళ్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో పాటు లారీ క్లినర్ అక్కడిక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆ దారిలో వెళుతున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలు పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. కిటికీల్లోంచి దూకేయడంతో 10 మందికి స్వల్పంగా గాయాలా అయ్యాయి. మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది. క్షతగాత్రులను నంద్యాల హాస్పటల్ కి తరలించారు.
