Maruthi | అసలు ప్లాన్ ఇదే..

Maruthi | అసలు ప్లాన్ ఇదే..

Maruthi | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మారుతి చిన్న సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేశాడు.. పెద్ద సినిమాలు చేసే స్థాయి ఎదిగాడు. అలాగే ఓ ట్రెండ్ సెట్టర్ గా నిలిచాడు. అయితే.. పాన్ ఇండియా మూవీ రాజాసాబ్ నిరాశపరచడంతో మారుతి నెక్ట్స్ ఏంటి..? అనేది ఆసక్తిగా మారింది. మెగా హీరోతో (Mega Hero) మారుతి సినిమా అంటూ ప్రచారం మొదలైంది. అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై మారుతి టీమ్ స్పందించింది. ఇంతకీ.. మారుతి టీమ్ ఏం చెప్పింది..? అసలు మారుతి ప్లాన్ ఏంటి..?

Maruthi

మారుతి మెగా హీరోతో సినిమా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ మెగా హీరో ఎవరో కాదు.. వరుణ్‌ తేజ్ అంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. ప్రచారంలో ఉన్న వార్తల పై మారుతి (Maruthi) టీమ్ రియాక్ట్ అయ్యింది. ఇంతకీ ఏం చెప్పిందంటే.. మారుతి సినిమా ఎవరితో అనేది ఇంకా పైనల్ కాలేదు. ఆ వార్తలను నమ్మద్దు. త్వరలో అంతా ఫిక్స్ అయిన తర్వాత అఫిషియల్ గా అనౌన్స్ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. అయితే.. ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. మెగా హీరోతో కాకుండా ఓ యంగ్ హీరోతో మారుతి సినిమా ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

Maruthi

ఈ రోజుల్లో అనే చిన్ని సినిమాతో సక్సెస్ సాధించిన తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ గా భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, మ‌హానుభావుడు, ప్ర‌తీరోజూ పండ‌గే తదితర చిత్రాలు తెరకెక్కించాడు. ఆ సినిమాలు అన్నీ సక్సెస్ సాధించాయి. ఇప్పుడు అదే తరహా సినిమా తీస్తే.. పైగా సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేస్తే.. సినిమా (Movie) ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అదే ప్లాన్ లో ఉన్నాడట మారుతి. మార్చి లేదా ఏప్రిల్ లో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. మరి.. మారుతితో సినిమా చేసే యంగ్ హీరో ఎవరో..? ఈ మూవీని నిర్మించే నిర్మాత ఎవరో క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Maruthi

CLICK HERE TO READ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్నారా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply