Drishyam 3 | పట్టాలెక్కేది ఎప్పుడు..?

Drishyam 3 | పట్టాలెక్కేది ఎప్పుడు..?

Drishyam 3 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : విక్టరీ వెంకటేష్‌.. ఇప్పుడు స్పీడు మామూలుగా లేదు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించినప్పటి నుంచి మరింత జోష్ తో సినిమా చేస్తున్నారు. ఈ ఇయర్ లో వెంకీ నుంచి మూడు సినిమాలు రానున్నాయని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఒక హీరో సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ చేయడమే కష్టంగా ఉంది. మరి.. వెంకీ నుంచి సినిమాలు సాధ్యమేనా..?

Drishyam 3

వెంకీ నుంచి ఈ ఇయర్ లో రానున్న మూడు సినిమాల్లో ఒక సినిమా ఆల్రెడీ వచ్చేసింది. అదే.. మన శంకర్ వరప్రసాద్ గారు. చిరంజీవితో కలిసి నటించిన ఈ మూవీలో వెంకీ రోల్ అదిరింది. చిరు, వెంకీ.. ఒకే ఫ్రేమ్ లో కనిపించేసరికి ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. దీనికి తగ్గట్టుగా సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో.. బొమ్మ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇలా సంక్రాంతికి వెంకీ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించారు. ఇక వెంకీ నంచి రానున్న మరో సినిమా ఆదర్శ కుటుంబం. ఈ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఫస్ట్ టైమ్ తన రూటు మార్చి.. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో క్రైమ్ ఎలిమెంట్ మిక్స్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ను బట్టి ఈ టాక్ వచ్చింది. ఈ సినిమా చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది. వెంకీ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫస్ట్ టైమ్ రూపొందుతోన్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో నారా వారి అబ్బాయి నారా రోహిత్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాను సమ్మర్ లో రిలీజ్ చేయాలనేది మేకర్స్ ప్లాన్. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తారని సమాచారం.

Drishyam 3

ఇక వెంకీ నుంచి వచ్చే మూడవ సినిమా దృశ్యం 3. దృశ్యం, దృశ్యం 2 సినిమాలు రెండు కూడా ఆడియన్స్ ని బాగా ఎంటర్ టైన్ చేశాయి. మలయాళంలో ఇప్పుడు దృశ్యం 3 షూటింగ్ జరుగుతుంది. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఏప్రిల్ లో మలయాళంలో దృశ్యం 3 రిలీజ్ కానుంది. అక్కడ దృశ్యం 3 రిలీజైన వెంటనే తెలుగులో వెంకీతో దృశ్యం 3 చేయడానికి పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఈ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేయాలనేది ప్లాన్. ఈ ప్లానింగ్ చూస్తుంటే.. అంతా అనుకున్నట్టుగా జరిగేట్టు ఉంది. సో.. వెంకీ నుంచి మూడు సినిమాలు రావడం ఖాయం అని చెప్పచ్చు.

CLICK HERE TO READ పట్టాలెక్కేది ఎప్పుడు..?

CLICK HERE TO READ MORE

Leave a Reply