Supreme Court | ఏపీ మద్యం కేసులో.. వారికి నిరాశే…

Supreme Court | ఏపీ మద్యం కేసులో.. వారికి నిరాశే…

Supreme Court | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కేసులో ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎదురుదెబ్బ తగిలింది. బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్‌రెడ్డి, ధనుంజయ్‌రెడ్డికి రెగ్యులర్‌ బెయిల్‌(regular bail) ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. దీంతో మ‌ళ్లీ వారికి నిరాశే ఎదురైంది.

దీని కోసం ట్రయల్‌కోర్టుకు వెళ్లాలని సీజేఐ ధర్మాసనం సూచిస్తూ వారికి 4 వారాల గడువు ఇచ్చింది. ముగ్గురు నిందితులు ఇప్పటికే డిఫాల్ట్‌ బెయిల్‌పై ఉన్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు పేర్కొన్నారు. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం నిబంధనలు అనుసరించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply