TG | నమ్మి ఓట్లేసిన పాపానికి అనుభవిస్తున్నారు

TG | నమ్మి ఓట్లేసిన పాపానికి అనుభవిస్తున్నారు
- మేము తెచ్చిన నిధులతో పనులకు పునఃశంకుస్థాపన చేస్తున్నారు.
- భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
TG | భూపాలపల్లి, ఆంధ్రపభ ప్రతినిధి : నమ్మి ఓట్లు వేసిన పాపానికి ప్రజల అనుభవిస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన భూపాలపల్లి పట్టణంలోని 9వ వార్డులో ఈ రోజు నిర్వహించిన బస్తీబాట కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకే మళ్లీ (పునః )శంకుస్థాపనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు.
హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూలగోడితే.. రియల్ ఎస్టేట్ దందా చేసే వాళ్లకు అండగా ఉండి, మూగజీవాలకు నిలువ నీడ లేకుండా చేసిన దొర మన దగ్గర ఉన్నాడని ఆరోపించారు. బీరన్న గుడికి పదిలక్షలు మంజూరంటా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడిపోతే మంజూరు పేపర్ చించుతాడట బ్లాక్ మెయిల్ రాజకీయాలను ప్రజలు గమనించాలన్నారు. బీఆర్ఎస్ హయం అభివృద్ధి చేశాం కాబట్టే ఓట్లు అడుగుతున్నామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు వేసే ఓటే అధికార కాంగ్రెస్ పార్టీకి చెంప చెళ్లుమనిపించేలా సరైన సమాధానం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ బుర్ర రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
