TG | ఘనంగా 48వ బ్రహ్మోత్సవ వేడుకలు….

TG | ఘనంగా 48వ బ్రహ్మోత్సవ వేడుకలు….
TG | గట్టుప్పల, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా గట్టుప్పల మండల కేంద్రంలోని శ్రీ శివ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో 48వ బ్రహ్మోత్సవ వేడుకలు ఈ రోజు ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవాలయ అధ్యక్షుడు అవ్వారు శ్రీనివాస్ ప్రణవ పతాకావిష్కరణ చేసి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. శ్రీ మార్కండేయ స్వామి జయంతిని పురస్కరించుకుని ఆలయంలో శ్రీ మార్కండేయ స్వామి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అర్చకులు,యజ్ఞ నిర్వాహకులు కలిసి గాయత్రి యజ్ఞాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాలయ కార్యవర్గ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
