District SP | భక్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం..

District SP | భక్తులకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తాం..

  • జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల

District SP | బాసర నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రభ : వసంత పంచమిని పురస్కరించుకుని బాసర శ్రీజ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక నుండి వచ్చే భక్తులకు పూర్తి భద్రత కల్పించే బాధ్యత మాపై ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. బాసర ఆలయాన్ని ఎస్పీ జానకి షర్మిల బైంసా ఏఎస్పీ రాజేష్ మీనాతో కలిసి ఆలయన్నీ సందర్శించరు.

ప్రత్యేక అక్షరభ్యాస‌ క్యూ లైన్, వీఐపీ క్యూ లైన్, ట్రాఫిక్ నియంత్రణ పై ఆలయ, పోలిస్ సిబ్బందికి సూచనలు చేశారు. ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసినట్లు, నిరంతరంగా సీసీటీవీ ద్వారా ప్రత్యేక నిఘ పర్యవేక్షణ ఉంటుందని ఎస్పీ అన్నారు. ఆలయంతో పాటు గోదావరి నది వద్ద కట్టుదిట్టమైన భద్రతతో పోలీసు సిబ్బందిని నియమిస్తామని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో బాసర సీఐ కిరణ్ కుమార్, ఎస్ ఇ నవనిత్ రెడ్డి, ఆలయ ఈవో ఆంజని దేవి పాల్గొన్నారు.

Leave a Reply