Fire | కారులో మంటలు..

Fire | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : జమ్ముకశ్మీర్ లోని సాంబాలో హైవేపై కారులో మంటలు చెలరేగాయి. కారులో మంటలు చెలరేగడంతో పఠాన్ కోట్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు.
