Megastar | ఆరు రోజుల్లో రికార్డ్..

Megastar | ఆరు రోజుల్లో రికార్డ్..

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సెన్సేషన్ మన శంకర్ వరప్రసాద్ గారు. హిట్ మిషన్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన మన శంకర్ వరప్రసాద్ గారు రిలీజ్ (Release) కు ముందు నుంచి ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే టాక్ ఉంది. అయితే.. అంచనాలకు మించిన సక్సెస్ సాధించింది. నేటికీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతుంది. ఈ భారీ, క్రేజీ మూవీ ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేసిందని తెలిసింది. ఇంతకీ.. మన శంకర్ వరప్రసాద్ గారు.. సెట్ చేసిన ఆల్ టైమ్ రికార్డ్ ఏంటి..?

Megastar

Megastar | వేరే లెవల్ మూవీ..

పటాస్ సినిమా నుంచి అనిల్ రావిపూడి.. అపజయం అనేది లేకుండా వరుసగా హిట్స్ సాధిస్తూ హిట్ మిషన్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతో ఈ మూవీని అనౌన్స్ చేసినప్పుడే ఇది పక్కా బ్లాక్ బస్టర్ (Block Buster) అనే టాక్ వచ్చింది. ఇక ఇందులో విక్టరీ వెంకటేష్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు అని తెలియగానే.. సినిమా వేరే లెవల్లో ఉంటుందనే పీలింగ్ ఆడియన్స్ లో కలిగిచింది. ఇక సంక్రాంతికి అందరి ఛాయిస్ ఈ సినిమానే అవ్వడం.. ఈ మూవీ అంచనాలకు మించి ఉండడంతో అనుకున్నట్టుగానే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయ్యింది. నిర్మాతకు, డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తీసుకువస్తుంది.

Megastar

Megastar | 6 రోజుల్లో బ్రేక్ ఈవెన్..

ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా అన్ని ఏరియాల్లో సరికొత్త రికార్డులను (Records) సృష్టిస్తోంది. ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ సాధించింది. 6వ రోజు ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా 261 కోట్లకు పైగా వసూలు చేసింది. రీజనల్ మూవీస్ లో 6 రోజుల్లో ఇంత పెద్ద అమౌంట్ కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు 300 కోట్ల మార్కుకు చేరువలో ఉంది. ముఖ్యంగా ఈ సినిమా యూఎస్ఏ లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుంది. $3 మిలియన్ల మైలురాయికి చేరువవుతోంది. గతంలో చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి $2.7 మిలియన్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు ఈ రికార్డ్ ను మన శంకర్ వరప్రసాద్ గారు మూవీ క్రాస్ చేసింది. మరి.. ఫుల్ రన్ లో ఇంకెంత కలెక్ట్ చేస్తుందో.. ఎలాంటి రికార్డ్ సెట్ చేస్తుందో చూడాలి.

Megastar

CLICK HERE TO READ ఆ వార్తలు నిజమేనా..?

CLICK HERE TO READ MORE

Leave a Reply