winners | ప్రతిభామూర్తులకు సత్కారం

winners | బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా దండెపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామంలో గల శ్రీకృష్ణ గోశాలలో ఇవాళ‌ రికార్డుల విజేతలకు ఘన సత్కారం జరిగింది. బెల్లంపల్లి పట్టణానికి చెందిన వేముల మానస రామాయణంలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ సాధించింది.

అంతేకాకుండా ఆమె కుమార్తెలు ఇద్దరు కూచిపూడి నృత్యంలో గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఆ మేరకు వీరి ప్రతిభను గోశాల యాజమాన్యం గౌరవించింది. ఒకే కుటుంబంలో ముగ్గురు చిన్నవయస్సలోనే పేరు ప్రఖ్యాతలు సంపాధించుకోవడం అభినందనీయమన్నారు.

ఈసందర్భంగా మానస మాట్లాడుతూ.. తల్లిదండ్రులు పిల్లలకు చిన్నతనం నుంచే సనాతన ధర్మంపై అవగాహన కల్పించాలని కోరారు. వారానికొక్కసారి పిల్లలను ఆలయాలకు తీసుకెళ్లి మన సంస్కృతిని తెలియజెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల వ్యవస్థాపకులు గుండం భూమయ్య-విజయలక్ష్మి, ఎలుగురి వేణు, కావ్య, గోలి తిరుపతి, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply