Makthal | హైమాస్ట్ లైట్ ఏర్పాటు కు భూమి పూజ

Makthal | హైమాస్ట్ లైట్ ఏర్పాటు కు భూమి పూజ
Makthal | మక్తల్ , ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం నర్వ మండలంలోని రాంపూర్ గ్రామం మఠం దగ్గర అదేవిధంగా ఎల్లంపల్లి గ్రామంలో హైమాస్ట్ లైట్స్ ఏర్పాటు కోసం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లా లక్ష్మికాంత్ రెడ్డి ఇవాళ భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎన్నికలలో ఎల్లంపల్లి గ్రామంలో బీజేపీ కార్యకర్తలు విజయం సాధిస్తే హైమాస్ట్ లైట్ వేయిస్తానని మాట ఇచ్చారు. అందుకనుగుణంగానే బీజేపీ కార్యకర్తలు సర్పంచ్, ఉపసర్పంచ్ గా విజయం సాధించడం, ఇచ్చిన మాట ప్రకారంగా హైమాస్ట్ లైట్ వేయడానికి భూమి పూజ చేరడం జరిగిందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బంగ్లి లక్ష్మికాంత్ రెడ్డి తెలిపారు.
అదేవిదంగా రాంపూర్ మఠం పీఠాధిపతులు శ్రీ ప్రభులింగ మహారాజ్ కోరిక మేరకు మఠం దగ్గర హైమాస్ట్ లైట్ వేయడానికి స్వామి వారి సమక్షంలో భూమి పూజ నిర్వహించామన్నారు. గ్రామాలలో ప్రజల సమస్యలు తీర్చేందుకు తన వంతు పూర్తి సహకారం అందిస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామంలో అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే సాధ్యం కాబట్టి ఎంపిటిసి జడ్పిటిసి లుగా బిజెపి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా లక్ష్మి కాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు .వ్యక్తిగతంగా ఎక్కడ ఏ చిన్న సమస్యలను వాటిని పరిష్కరించేందుకు నా వంతు పూర్తి సహకారం అందిస్తానని అన్నారు.
కార్యక్రమంలో నూతనంగా సర్పంచ్ గా, ఉపసర్పంచ్ గా, వార్డు మెంబర్లు గా విజయం సాధించిన బీజేపీ నాయకులు గ్రామపెద్దలు పాల్గొన్నారు.
