Nandyala | త్రిపురనేని రామస్వామి జయంతి వేడుకలు

Nandyala | త్రిపురనేని రామస్వామి జయంతి వేడుకలు

Nandyala | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : స్వాతంత్ర సమరయోధుడు కవి రాజుగా పిలువబడుతుంది సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి ఆశయాలకు అనుగుణంగానే నేటి యువత పని చేయాలని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ యుగంధర్ బాబు పేర్కొన్నారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ఆదేశాల మేరకు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కవిరాజు అని పిలువబడే ప్రముఖ తెలుగు సాహిత్యకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది, స్వాతంత్ర్య సమర యోధుడు త్రిపురనేని రామస్వామి అన్నారు. 1887 జనవరి 15న కృష్ణా జిల్లాలోని అంగలూరు గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. లండన్ డబ్లిన్లో న్యాయశాస్త్రం చదివి న్యాయవాదిగా పని చేశారన్నారు. సంస్కృతం, ఆంగ్లం భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండేవారన్నారు. 1929లో ఆంధ్ర మహాసభ వారు కవిరాజు బిరుదునిచ్చి గౌరవించారని తెలిపారు.
హేతువాదం, మానవతావాదంలను తెలుగు సాహిత్యంలోకి తీసుకొచ్చిన మొదటి కవిగా పేరు తెచ్చుకున్నాడని కొనియాడారు.

మత మౌఢ్యం, కుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేశారు. సామాజిక సంస్కరణల కోసం నాటకాలు, కవితలు, వ్యాసాలు రచించారు. ఆయన రచనలు బ్రాహ్మణాధిపత్యం, ఆచారాల పై ప్రశ్నలు లేవనెత్తాయన్నారు. సూత పురాణము, కురుక్షేత్రం (నాటకం), సూతాశ్రమ గీతాలు, ఇతర కవితలు ఉన్నాయన్నారు. ఆయన రచనలు ఇప్పటికీ తెలుగు సాహిత్యం, సామాజిక చరిత్రలో ముఖ్యమైనవి అన్నారు. ఈ కార్యక్రమంలో సాయుధ బలగాల డీఎస్పీ శ్రీనివాసులు రిజర్వు ఇన్స్పెక్టర్లు బాబు, సురేష్ బాబు, రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్లు కాళీ శ్రీ చరణ్, మనోహర్, హర్షవర్ధన్ రెడ్డి, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply