98 voters | రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ బృందావనపురం
98 voters | రాష్ట్రంలోనే అతి చిన్న పంచాయతీ బృందావనపురం
- కేవలం 98 ఓట్లు
- సర్పంచ్, నాలుగు వార్డు స్థానాలకు ఎన్నికలు
98 voters | ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్రం లోనే అతి చిన్న పంచాయతీ నల్లగొండ జిల్లా త్రిపురాం మండలం బృందావనపురం. గ్రామంలో కేవలం 98 ఓట్లు మాత్రమే ఉన్నాయి. పెద్దదేవులపల్లి గ్రామపంచాయతీ నుండి విడదీసి బృందావనపురం గ్రామపంచాయతీ(Gram Panchayat)ని ఏర్పాటు చేశారు.
గ్రామంలో మొత్తం వందమంది జనాభా ఉండగా వీరిలో 98 మంది ఓటర్లు(98 voters) ఉన్నారు. గ్రామంలో నాలుగు వార్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఈనెల 14వ తేదీన రెండో విడత ఎన్నికల్లో భాగంగా బృందావన పురం గ్రామపంచాయతీ సర్పంచ్ స్థానానికి పోలింగ్ జరగనుంది. గ్రామంలో ఉన్న 98 మంది ఓటర్లలో పురుష ఓటర్లు 42 మంది, మహిళా ఓటర్లు 56 మంది ఉన్నారు. కులాల వారిగా గ్రామంలో 91 మంది ఓసి ఓటర్లు ఉండగా, కేవలం 7 ఎస్సీ ఓట్లు ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ కు కేటాయించారు.
దీంతో సర్పంచ్ స్థానానికి మాజీ సర్పంచ్ రమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున, వంగాల సైదిరెడ్డి బీ ఆర్ఎస్ తరపున బరిలో ఉన్నారు. గ్రామంలోని నాలుగు వార్డుల్లో ఒకటవ వార్డు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన మూడు వాదు స్థానాలకు పోలింగ్(polling) జరగనుంది. పోలింగ్ కోసం గ్రామంలో 20వ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు.
