Monsoons16May | ఏపీ, తెలంగాణ‌కు డబుల్ ట్రీట్

Monsoons16May | ఏపీ, తెలంగాణ‌కు డబుల్ ట్రీట్

Monsoons16May |తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన‌ ప‌గ‌టిపూట ఉష్ణోగ్ర‌తలు
ఏకంగా 47 నుంచి 49 డిగ్రీల వ‌ర‌కు..
ఈ రెండు రోజులు సాయం స‌మ‌యంలో అక్క‌డ‌క్క‌డా వ‌ర్షాలు
రేపు నైరుతీ రుతుప‌వ‌నాలు ఎంట్రీ
నెలాఖ‌రు నుంచి వాన‌లే వాన‌లు

Monsoons16May |హైద‌రాబాద్,ఆంధ్ర‌ప్ర‌భ : తెలుగు రాష్ట్రాల ప్రజలకు అటు ఎండలు, ఇటు వానలు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఒకవైపు భానుడు భగ్గుమంటుంటే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాతావరణాన్నికూల్ చేసేందుకు రెడీ అవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజా బులిటెన్ ప్రకారం.. రానున్న ఐదు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం విచిత్రంగా మారబోతోంది.

మే 16న రుతుపవనాల గ్రాండ్ ఎంట్రీ
వేసవి తాపంతో అల్లాడిపోతున్న వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాకకు లైన్ క్లియర్ అయ్యింది. మే 16వ తేదీ నాటికి ఇవి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. అంటే దేశంలోకి వర్షాకాలం ఎంట్రీ ఇవ్వడానికి ముహూర్తం ఫిక్స్ అయినట్లే. ప్రస్తుతం పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న బలమైన అల్పపీడనం సముద్ర మట్టానికి సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉండటంతో వర్షాలు పడేందుకు వాతావరణం అనుకూలంగా మారింది.

తెలంగాణలో వానలు.. అంతలోనే వడగాల్పులు
తెలంగాణలో వాతావరణం కాస్త మిక్స్‌డ్‌గా ఉండబోతోంది. మే 14న రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే చాన్స్ ఉంది. అయితే, మరో నాలుగు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయి. మే 15-16 తేదీల్లో జయశంకర్ భూపాలపల్లి, ములుగులో గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. మే 15 నుంచి ఇక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మే 17 నాటికి కరీంనగర్, పెద్దపల్లికి కూడా ఇవి విస్తరిస్తాయని ఐఎండీ అంచనా వేసింది.

ఏపీలో ఎండల సెగ.. రాయలసీమలో పిడుగుల భయం
ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ హాట్‌గా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరుకునే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని చెప్పింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో ఉరుములతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. రాయలసీమ జిల్లాల్లో మే 15, 16 తేదీల్లో అక్కడక్కడా పిడుగులు పడే చాన్స్ ఉంది. వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండేవారు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

CLICK HERE TO READ Medicine Centers | ప్రైవేట్ కు.. చెక్

CLICK HERE TO READ MORE

Leave a Reply