17people | పేకాట రాయుళ్లపై మెరుపు దాడి…

17people | పేకాట రాయుళ్లపై మెరుపు దాడి…
- నగదు, వాహనాలు సీజ్
- 17 మంది అదుపులోకి
- రూ.6.74 లక్షలు స్వాధీనం
17people | ఉమ్మడి కరీంనగర్ బ్యూరో, ఆంధ్రప్రభ : నగరంలోని 3 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబాష్‌నగర్‌లో అక్రమంగా పేకాట ఆడుతున్న ఇంటి పై పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6,74,280 నగదు, 16 మొబైల్ ఫోన్లు, 104 ప్లేయింగ్ కార్డులు, 2 బైకులు, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల సమాచారం ప్రకారం… సోమవారం సాయంత్రం వేళలో సబ్ ఇన్‌స్పెక్టర్ బి. చెరాలు కు అందిన విశ్వసనీయ సమాచారంతో, టౌన్ ఏసీపీ అనుమతితో రాత్రి సుమారు 8.15 గంటలకు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇంటిపై దాడి చేశారు.
ఇంట్లో రెండు టేబుళ్లపై మూడు కార్డులతో డబ్బులు పెట్టి పేకాట ఆడుతున్నట్లు గుర్తించారు.ఈ ఘటనలో సిరిపురం నాగభూషణం (A1), చింతల రవీందర్ (A2), బండ రత్నాకర్ రెడ్డి (A3), గోదాల రాజిరెడ్డి (A4), జంగ దేవేందర్ రెడ్డి (A5), దొంతుల భరత్ (A6), ముష్కం ఉపేందర్ (A7), తల్లపల్లి తిరుపతి (A8), రవికంటి సందీప్ (A9), మేచినేని శ్రీనివాస్ రావు (A10), కేతిరెడ్డి జగన్ మోహన్ రెడ్డి (A11), ముష్కం ఎల్లయ్య (A12), తుమ్మనపల్లి శ్రీనివాస్ రావు (A13), అలువోజు సంపూర్ణ చారి (A14), బొట్టు రవీందర్ (A15), వడ్డి కవి కుమార్ రెడ్డి (A16), గడ్డం విద్యాసాగర్ (A17)లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ప్రధాన నిందితుడు సిరిపురం నాగభూషణం పేకాట నిర్వహిస్తూ కామన్ గేమింగ్ హౌస్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం నిందితులందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
