ENG vs AUS | భారీ ఛేద‌న‌లో ఆసీస్.. ఐదోవ‌ర్ల‌కే రెండు వికెట్లు ఫ‌ట్ !

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రికార్డ్ స్కోర్ ను ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన కంగారూల‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. 352 ప‌రుగుల భారీ టార్గెట్ తో ఛేజింగ్ కు వ‌చ్చిన ఆసీస్.. 4.1 ఓవ‌ర్ల‌లో 27 ప‌రుగుల‌కే రెండు కీల‌క వికెట్లు కోల్పోయింది.

విధ్వంస‌కర బ్యాట‌ర్, ఆస్ట్రేలియా ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (6), వ‌న్ డౌన్ లో క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్ (5) సింగిల్ డిజిట్ స్కోర్ కే వెనుదిరిగారు.

ప్ర‌స్తుతం క్రీజులో ఓపెన‌ర్ మాథివ్ షార్ట్ (24 బంతుల్లో 30), మార్నస్ లాబుషేన్ (7 బంతుల్లో 5) ఉన్నారు. ఏడు ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఆసీస్ స్కోర్ 50/2

Leave a Reply