12 companies | 20న జాబ్‌మేళా

12 companies | 20న జాబ్‌మేళా
- 12 కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు
12 companies | నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలోని నిరుద్యోగులకు ఈనెల 20వ తేదీన 12 కంపెనీల(12 companies) ద్వారా ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నట్లు శ్రీ రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి గురువారం తెలిపారు. నిపుణ హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ ద్వారా ఈ ఉద్యోగ నియామకాలను చేపడుతున్నట్లు తెలిపారు. యాక్సిస్ బ్యాంకు, మెడిప్లస్, పేటీఎం, ముత్తూట్ ఫైనాన్స్, అపోలో, జస్ట్ రిలయన్స్, టెంటు, టాటా తదితర కంపెనీల యాజమాన్యాలు నిరుద్యోగులకు(unemployed) అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు.
పట్టణంలోని ఎస్‌బీఐ కాలనీలో ఉన్న పీజీ కళాశాలలో ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మైనార్టీ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ల ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్వహించే స్కిల్ డెవలప్మెంట్(skill development) ద్వారా నిరుద్యోగులకు ఈ అవకాశాలను కల్పిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు. జిల్లాలోని నిరుద్యోగులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. హెల్ప్ లైన్ నెంబర్ 8121212873లో సంప్రదించాలని రామకృష్ణారెడ్డి సూచించారు.
