బృందావన్ కాల్వ మరమ్మతులు చేయిస్తా

బృందావన్ కాల్వ మరమ్మతులు చేయిస్తా

  • తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

మోత్కూర్, ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ) మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలో నివాస గృహాల మధ్య ఉన్న బృందావన్ కాల్వ అస్తవ్యస్తంగా మారిందని ,బృందావన్ కాల్వ మరమ్మతులు చేయించి వరద నీరు సాఫీగా వెళ్లేలా ,ప్రజలకు ఇబ్బందులకు కలగకుండా, అనారోగ్యాల బారిన పడకుండా చూస్తానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు.గురువారం 1,9 వార్డులలో ఎన్నికల ప్రచారంలో భాగంగా బృందావన్ కాల్వ ను పరిశీలించారు.

ఇరిగేషన్ ఎస్ ఈ కి ఫోన్ చేసి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. ఎన్నికల అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ల దృష్టికి తీసుకెళ్లి బృందావన్ కాల్వ మరమ్మతులు పూర్తి స్థాయిలో చేపడతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి, డా గుర్రం లక్ష్మి నర్సింహారెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండగొని రామచంద్రు,1,9 వ వార్డు అభ్యర్థులు పల్లెర్ల వెంకన్న,బీసు శ్రీకాంత్ గౌడ్,నాయకులు కందుల విక్రాంత్,జంగ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply