దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలి..

మునుగోడు, ఆంధ్రప్రభ : దేశ అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దూడల భిక్షంగౌడ్, బీజేవైఎం నల్గొండ జిల్లా అధ్యక్షుడు కంభాలపల్లి సతీష్‌యాదవ్‌ పిలుపునిచ్చారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా గురువారం మునుగోడు మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు పెంబళ్ళ జానయ్య ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు,బీజేపీ నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్న మహనీయుల త్యాగాలను యువత స్మరించుకోవాలన్నారు. దేశభక్తి భావాన్ని పెంపొందించుకుని దేశ ప్రగతికి తమ వంతు కృషి చేయాలని సూచించారు. జాతీయ సమైక్యత, స్ఫూర్తిని చాటేందుకే హర్‌ఘర్‌ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు పగిళ్ల భిక్షం, కంభంపాటి నరసింహ, గోలి లింగస్వామి, కార్మిక సెల్ జిల్లా కోకన్వీనర్ మాధగోని నరేందర్‌గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి సతీష్‌, బీ జేపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, బూత్‌ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.