చిన్నకాపర్తిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం..
చిట్యాల, ఆంధ్రప్రభ : చిట్యాల మండలంలోని చిన్నకాపర్తి గ్రామంలో శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.
గ్రామ ప్రజలతో కలిసి సర్పంచ్ ఆవుల సుందర్ మొక్కను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలన్నారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవసరమని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆవుల మాధవి, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు శ్రీధర్ రెడ్డి, పెరక నాగనాగరాజు, నందిపాటి మహేష్, పెరక ఈశ్వరయ్య, పోలిమేర దశరథ, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
