సీ ఫుడ్స్ ఎగుమతులకు కొత్త దిశ..
సీ ఫుడ్స్ ఎగుమతులకు కొత్త దిశ..
విశాఖలో జాతీయ స్థాయి వర్క్‌షాప్ ప్రారంభం
విశాఖపట్నం, ఆంధ్రప్రభ: సీ ఫుడ్స్ ఎగుమతుల అభివృద్ధి, అంతర్జాతీయ మార్కెట్లలో భారత ఉత్పత్తుల విస్తరణ లక్ష్యంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి వర్క్‌షాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.

విశాఖపట్నంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు రాజీవ్ రంజన్ సింగ్, రామ్మోహన్ నాయుడు, చిరాగ్ పాశ్వాన్ హాజరయ్యారు.
అలాగే రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ బీదా మస్తాన్ రావు తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేసి వర్క్‌షాప్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా ప్రారంభించారు. సీ ఫుడ్స్ రంగంలో ఎగుమతుల పెంపు, మత్స్యకారులకు మెరుగైన అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, అంతర్జాతీయ ప్రమాణాల అమలుపై ఈ వర్క్‌షాప్‌లో చర్చలు జరగనున్నాయి.
