ఏలూరులో పర్యటిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ..

ఏలూరులో పర్యటిస్తున్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ..

ఏలూరు బ్యూరో, ఆంధ్ర ప్రభ : మెప్మా మహిళలతో నిర్వహిస్తున్న తృప్తి క్యాంటీన్ పరిశీలించి క్యాంటిన్లో అల్పాహారం తీసుకున్న మంత్రి నారాయణ. మంత్రి నారాయణ వెంట ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ నూర్జహన్ పెదబాబు, కలెక్టర్ వెట్రి సెల్వి, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, మున్షిపల్ కమిషనర్ భాను ప్రతాప్‌ ఉన్నారు. అల్పాహారం అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, మెప్మా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తృప్తి క్యాంటిన్ ల ద్వారా ప్రోత్సహిస్తున్నామని, అర్బన్ ప్రాంతాలలో 28 లక్షల మంది మహిళలు ఉన్నారన్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి మహిళలను పారిశ్రామిక వేత్తలను చేసేందుకు తీసుకున్న నిర్ణయంలో భాగంగానే తృప్తి క్యాంటీన్లు నిర్వహణ జరుగుతుందని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్రంలో 8 ప్రాంతాల్లో తృప్తి క్యాంటిన్లు ఉన్నాయని ,మరో ఎనిమిది తృప్తి క్యాంటీన్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని వాటిలో భాగంగానే ఏలూరులో మరో తృప్తి క్యాంటీన్ ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నారు.