తులసీదేవికి నీరాజనం

ప|| పురందర సతీ పూజ్యకూ జ్ఞానవిజ్ఞాన
దాయికీ శ్రీ తులసీదేవికీ నీరాజనం

అను|| బృందాసుగుణ సంపత్తికీ
చలస్మంజీర చరణకూతటీల్లతాంగికీ
చతురానన సేపితానైకతశ్రోణికీ
శ్రీ కృష్ణప్రియకూ నీరాజనం

చ|| శ్రీ విష్ణుప్రియకూ మునీంద్ర హృదయ
వాసికి పుల్లపద్మ దళేక్షణా పంచ
కళాత్మికా లక్ష్మీ చంద్ర సహూదరికీ
పాపారణ్య దవానలకూ శ్రీ విష్ణుప్రియాకూ
శ్రీ తులసీదేవికీ నీరాజనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *