ప్రధాని రాక కబురుతో..

ప్రధాని రాక కబురుతో..

  • శ్రీశైలంలో ముందస్తు మహా శివరాత్రి
  • 16 మంది పాలకమండి సభ్యుల నియామకం


ఆంధ్రప్రభ, శ్రీశైలం (నంద్యాల జిల్లా) : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam)లోని భ్రమరాంబికా మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ రాకతో.. శ్రీశైలంలో మహాశివరాత్సోవాల తరహాలో.. రాష్ట్ర పభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆలయ పాలక మండలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే శ్రీశైలం దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా పోతుగుంట రమేష్ నాయుడు (అన్నమయ్య జిల్లా) ను నియమించింది. ఈ పాలక మండలిలో 16 మంది సభ్యులు, నలుగురు ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. నియమిత సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి.

శ్రీశైలం దేవస్థానం (Srisailam Temple) ట్రస్ట్ బోర్డు సభ్యులుగా శ్రీకాకుళం టీడీపీకి చెందిన ఏవీ రమణ, ఒంగోలు జిల్లా గిద్దలూరు కు చెందిన బాలినేని రవణమ్మ, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలానికి చెందిన చిట్టి బొట్ల భరద్వాజ్ శర్మ, నంద్యాల జిల్లా డోన్ కు చెందిన జి.లక్ష్మేశ్వరి, శ్రీశైలానికి చెందిన గుల్ల గంగమ్మ, ఏలూరుకు చెందిన కోడె క్రాంతి వర్ధని, మంగళగిరికి చెందిన శంకర శెట్టి పిచ్చయ్య, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు కు చెందిన జనసేన పార్టీ నేత జావజి రేఖ గౌడ్, ప్రకాశం జిల్లా పర్చూరుకు చెందిన ఆలా అనిల్ కుమార్, ప్రకాశం జిల్లా కనిగిరి కి చెందిన జనసేన (Janasena) నేత దేవకి వెంకటేశ్వర్లు, గుంటూరుకు చెందిన బోడెపూడి వెంకట సుబ్బారావు, దేవరకొండకు చెందిన చిలివేరు కాశీనాథ్, నంద్యాల పట్టణానికి చెందిన బీజేపీ నేత మేడ మురళీధర్, కావలికి చెందిన టీడీపీ నేత ఉప్పుటూరి సుబ్బలక్ష్మీ, నంద్యాల పట్టణానికి చెందిన టీడీపీ నేత డాక్టర్ డి.వి.సింధుశ్రీ, నంద్యాల జిల్లా పాణ్యం టీడీపీ నేత పి.యు.శివమ్మను పాలకమండలి సభ్యులుగా నియమించారు.

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరానికి చెందిన కారుపర్తి నాగ మల్లేశ్వరరావు, కొవ్వూరు కు చెందిన వేమిరెడ్డి కోటా రెడ్డి, నంద్యాల జిల్లా డోన్ కు చెందిన బుగ్గన చంద్రమౌలీశ్వర్ రెడ్డిని, కట్టా సుధాకర్ రెడ్డి (తెలంగాణ టీడీపీ నేత) ను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు.

Leave a Reply