Tirumala | సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత
Tirumala | సామాన్య భక్తులకు భారీ ప్రాధాన్యత
టీటీడీ కీలక నిర్ణయాలు
Tirumala | తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమల (Tirumala) లో టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం (TTD Board of Trustees emergency meeting) ముగిసింది. బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ… వైకుంఠ ద్వార దర్శనాల (వైకుంఠ ఏకాదశి నుంచి ద్వాదశి వరకు) పూర్తి వివరాలు వెల్లడించారు.
ప్రధాన నిర్ణయాలు:
వైకుంఠ ద్వార దర్శనాలు: డిసెంబర్ 30, 2025 నుంచి జనవరి 8, 2026 వరకు (10 రోజులు), సీఎం (CM) ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. పది రోజులలో 182 గంటలు దర్శనం సమయం ఉంటుందన్నారు. అందులో 164 గంటల సమయం సామాన్య భక్తులకు మాత్రమే కల్పిస్తామన్నారు. మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు రద్దు.. జనవరి 2వ తేది నుండి 8వ తేది వరకు రోజుకు 15వేల రూ.300 దర్శన టిక్కెట్లు, 1000 శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యూలర్ పద్ధతిలో కేటాయింపు ఉంటుందన్నారు. మొదటి మూడు రోజులకు ఈ-డిప్ ద్వారా కేటాయింపు ఉంటుందన్నారు.
నవంబర్ 27 నుండి డిసెంబర్ 01 వ తేది వరకు దర్శన టోకెన్ల రిజిస్ట్రేషన్ (Tokens registration) కు అవకాశం కల్పిస్తామన్నారు. డిసెంబర్ 2న డిప్ ద్వారా ఎంపికైన వారికి టోకెన్లు కేటాయింపు, టీటీడీ వెబ్ సైట్, యాప్, వాట్సాప్ ద్వారా పారదర్శకంగా టోకెన్ల జారీకి రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుందన్నారు.
ఆన్ లైన్ (Online) లో ముందు బుక్ చేసుకున్న వారికి ముందు ప్రాతిపదికన టోకెన్లు కేటాయింపు, జనవరి 6,7,8 తేదిల్లో తిరుమల, తిరుపతి స్థానికులకు రోజుకు 5వేల టోకెన్లు కేటాయింపు ఉంటుందన్నారు. ఏడు రోజుల పాటు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకు మాత్రమే దర్శనం ఉంటుందన్నారు. ఏడు రోజులు సర్వ దర్శనానికి నేరుగా క్యూలైన్ లో వచ్చే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనమన్నారు. సీఎం ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
