నాగర్‌కర్నూల్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు..
- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న
- రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నారెడ్డి,
- జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్
నాగర్‌కర్నూల్, ఆంధ్రప్రభ : ఆగస్టు 15న నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించనున్న 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య అతిథిగా నియమించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జి. చిన్నారెడ్డి హాజరై ఉదయం 9:20 గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నట్లు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ తెలిపారు.
ఉదయం 9:05 గంటలకు ప్రారంభం
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కార్యక్రమ వివరాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ వెల్లడించారు. ఉదయం 9:05 గంటలకు జిల్లా ఎస్పీ, 9:10 గంటలకు జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్, 9:15 గంటలకు ముఖ్య అతిథి డాక్టర్ జి. చిన్నారెడ్డి పెరేడ్ మైదానానికి చేరుకుంటారని తెలిపారు.
9:20 గంటలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన, రాష్ట్ర అధికారిక గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 9:30 గంటలకు పోలీస్ కవాతు, 9:40 గంటలకు ముఖ్య అతిథి జిల్లా ప్రగతి సందేశం ఇవ్వనున్నారు.
విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
10:05 గంటలకు వివిధ పాఠశాలలకు చెందిన బాలబాలికలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 10:40 గంటలకు ముఖ్య అతిథి చేతుల మీదుగా స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం చేయనున్నారు.
ప్రగతి స్టాళ్ల సందర్శన
10:45 గంటలకు వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి స్టాళ్లను ముఖ్య అతిథి సందర్శించనున్నారు. 11:15 గంటలకు వివిధ శాఖల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాల బహూకరణ కార్యక్రమం నిర్వహించనున్నారు.
11:50 గంటలకు ముగింపు
11:45 గంటలకు జాతీయ గేయాలాపన, జాతీయ గీతాలాపన అనంతరం 11:50 గంటలకు వందన సమర్పణతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ముగియనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
