భక్తిశ్రద్ధలతో తొలి శ్రావణ శుక్రవారం పూజలు..

గరిడేపల్లి, ఆంధ్రప్రభ ; మండల కేంద్రంలోని శ్రీ గుండాలమ్మ అమ్మవారి ఆలయంలో తొలి శ్రావణ శుక్రవారం వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కడియం పుష్ప ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ మాసం తొలి శుక్రవారం కావడంతో ఆలయానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పసుపు, కుంకుమ, పూలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కుటుంబ సభ్యులు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో సాయి ప్రియ, అరుణ, సరిత, మాధవితో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.