రైతులు వాడే యూరియాను వాడవద్దు

రైతులు వాడే యూరియాను వాడవద్దు

రాప్తాడు, ఆంధ్రప్రభ : వ్యవసాయ నిమిత్తం రైతులకు ఇచ్చేటువంటి యూరియాను ఇండస్ట్రీస్ లో వాడుకూడదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.రవి ఇండస్ట్రీస్ యజమానులను హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా యూరియా (టెక్నికల్ గ్రేడ్) వాడే ఇండస్ట్రీస్ ను తనిఖీ నిర్వహణలో భాగంగా శనివారం రాప్తాడు మండల పరిధిలోని గొందిరెడ్డిపల్లి గ్రామం నందు ఎంఎస్ఎంఈ పార్క్ లో ఉన్న ఎం.ఎస్ పెయింట్స్ ను తనిఖీ చేశారు.

జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.రవి మాట్లాడుతూ ఇండస్ట్రీస్ లో ఎవరైతే యూరియా (టెక్నికల్ గ్రేడ్) వాడుతున్నారో ఖచ్చితంగా టెక్నికల్ గ్రేడ్ నే వాడాలి అంతేగాని వ్యవసాయ కోసం రైతులకు ఇచ్చే యూరియాను ఎవరైనా వాడినట్టు బయట పడితే వారి ట్రేడ్ లైసెన్స్ రద్దు చేస్తామని, చట్టపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డివిజన్ ఏడిఏ వెంకటకుమార్, టెక్నికల్ ఎఓ రాకేష్, రాప్తాడు వ్యవసాయ శాఖ అధికారి కృష్ణచైతన్య, ఏఈఓ రంజిత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply