TPT | విజయ్ ప్రభంజనం.. శ్రీవారిని దర్శించుకున్న త్రిష

TPT | విజయ్ ప్రభంజనం.. శ్రీవారిని దర్శించుకున్న త్రిష

TPT | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ప్రముఖ నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ప్రత్యేక దర్శనంలో పాల్గొన్న ఆమె, శ్రీ వేంకటేశ్వర స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం త్రిష ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, స్వామివారి ఆశీస్సులు పొందడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు.

తమిళనాడు రాజకీయాల్లో కీలకంగా మారిన నటుడు విజయ్ కు అత్యంత సన్నిహితురాలిగా త్రిష గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. దీంతో ఆమె తిరుమల పర్యటన కూడా చర్చనీయాంశంగా మారింది. తిరుమలలో ఆమెను చూసేందుకు భక్తులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. త్రిష అభిమానులకు అభివాదం చేస్తూ పలకరించారు. ఈరోజు త్రిష పుట్టినరోజు కావడం విశేషం. తన పుట్టినరోజునే ఎన్నికల ఫలితాలు రావడం.. విజయ్ ప్రభంజనం సృష్టించడంతో సంతోషంగా ఫీలవుతున్నారు త్రిష.