వధూవరులను ఆశీర్వదించిన యశస్విని ఝాన్సీ రెడ్డిలు…

వధూవరులను ఆశీర్వదించిన యశస్విని ఝాన్సీ రెడ్డిలు…

తొర్రూరు, ఆంధ్రప్రభ : తొర్రూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హమ్యా-భద్రమ్మ కుమార్తె అనూష,టీచర్ ధరావత్ రామచంద్రు నాయక్-సుజాత ల కుమారుడు ఉదయ్ కుమార్ ల వివాహం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ మహోత్సవ వేడుకలో పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝాన్సి రాజేందర్ రెడ్డిలు నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దాంపత్య జీవితం ఆనందంగా, ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యసంపదలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యంగా ముచ్చటిస్తూ, ఈ శుభకార్యం ఎంతో సంతో షాన్నిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply