TDP | వైసీపీ గూటికి..

TDP | వైసీపీ గూటికి..


TDP | ఎమ్మిగనూరు అర్బన్, ఆంధ్ర ప్రభ : రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికల్లో వైసీపీ (YCP) విజయమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రాజీవ్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మిగనూరు మండలం సిరాల దొడ్డి గ్రామం నుండి టీడీపీ నాయకులు సుమారు 100 మంది ఎర్రకోట రాజీవ్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎర్రకోట జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి రాజీవ్ రెడ్డి కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) రైతులకు, యువతకు, మహిళలకు, వృద్ధులకు, విద్యార్థులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యంగం అమలు చేస్తున్న తీరును చూసి సొంతపార్టీను వీడి వైసీపీలో చేరికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న బడేసాబ్ కుమారులు బజ్జి, ఖాజా, కుమ్మరి లక్షమన్న, కుమ్మరి సోమేశ్, బోయ రైతన్న, హరిజన బాలు, కుమ్మరి చెన్నప్ప, గొల్ల చిరంజీవి, పింజారి దస్తగిరి, పింజారి మౌలాలి, పింజారి అల్లిపీరా, పింజారి ఖాజా, గొల్ల మధు, వైస్సార్సీపీ నాయకులు రాళ్లదొడ్డి చాంద్ భాషా, యువకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.