కర్నూలు బ్యూరో, మే 19, ఆంధ్రప్రభ : ప్యాపిలి మండలం, పోతుదొడ్డి వద్ద గత అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందిన ఘటన చోటుచేసుకుంది. కర్ణాటకలోని తుంకూర్ కి చెందిన సంతోష్ (36), నవీన్ (43), లోకేష్ (35) శ్రీశైలం దైవ దర్శనానికి వెళ్లి తిరిగి కర్ణాటక రాష్ట్రం తుంకూరుకి వెళ్తుండగా మార్గ మధ్యలో ప్యాపిలి మండలం, పోతుగల్ వద్ద వీరు వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. వీరు వెళ్తున్న వాహనం బోల్తా పడడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ముగ్గురు యువకులు మృతి చెందారు.
KNL | రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి..
