యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలలో సైబర్ నేరాలను అరికట్టడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. బ్యాంకులు డిస్‌కనెక్ట్ చేసిన/సరెండర్ చేసిన మొబైల్ నంబర్లను మార్చి 31లోగా తొలగించాలని ఆదేశించింది. ఈ మార్గదర్శకాలు వచ్చె నెల (ఏప్రిల్) 1 నుండి అమలులోకి రానున్నాయి.
సాధారణంగా, ఒక మొబైల్ నంబర్‌ను వరుసగా 90 రోజులు వాయిస్ కాల్స్, ఎస్‌ఎంఎస్ లేదా కనీసం డేటా కోసం ఉపయోగించకపోతే, మొబైల్ కంపెనీలు ఆ నంబర్‌ను డీయాక్టివేట్ చేస్తాయి. ఈ డీయాక్టివేట్ అయిన నంబర్లను ఇతర వినియోగదారులకు కేటాయిస్తారు.
ఈ కారణంగా, బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసిన మొబైల్ నంబర్లు మారినప్పుడు.. సమస్యలు, సైబర్ నేరాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, ఏప్రిల్ 1 నుండి ప్రతి వారం డీయాక్టివేట్ అయిన, సరెండర్ చేయబడిన నంబర్‌లను తొలగిస్తూ, బ్యాంకులు తమ డేటాబేస్‌ను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని NPCI స్పష్టం చేసింది.
మార్చి 31 నాటికి బ్యాంకులతో పాటు యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు కూడా ఈ మార్గదర్శకాలను పాటించాల్సిందేనని NPCI స్పష్టం చేసింది. దీంతో యాక్టివ్‌లో లేని నంబర్లకు యూపీఐల డీయాక్టివేట్ అవుతుంది.