ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కు సర్పంచుల సన్మానం
ఎగ్జిక్యూటివ్ మెంబెర్ కు సర్పంచుల సన్మానం
టేకుమట్ల, ఆంధ్రప్రభ : టేకుమట్ల మండల కేంద్రంలో పిఆర్ఎంఆర్ గార్డెన్ లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమితులైన దొంతుల శ్రీనివాస్ ని మండల సర్పంచులు కలిసి శాలువాతో సత్కరించి శుభకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని పదవులు పొంది ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచ్ నాంపల్లి వీరేశం, సర్పంచులు బొడ్డు తిరుపతి, కుర్రే మల్లయ్య, నేరెళ్ల రామకృష్ణ గౌడ్, తోట సాగర్, అంబాల కిరణ్, వంగ మమత, శ్రీధర్, మారం రచన, శ్రీకాంత్ మండల కాంగ్రెస్ కోశాధికారి శాస్రాల కిరణ్, ఉప సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు అజయ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.
