యుద్ధ ప్రభావం…. వంట గ్యాస్ కు కష్టం..!!

యుద్ధ ప్రభావం…. వంట గ్యాస్ కు కష్టం..!!

  • గోదావరిఖనిలో హోటల్స్ కు దర్జాగా డొమెస్టిక్ గ్యాస్
  • రూ.2500 కు బ్లాక్ మార్కెట్లో సిలిండర్ల అమ్మకాలు
  • అధికారుల నిఘా అంతంత మాత్రమేనని ఆరోపణలు

గోదావరిఖని, ఆంధ్రప్రభ ; యుద్ధ ప్రభావం నేపథ్యం వంట గ్యాస్ కు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. వంట గ్యాస్ కు వినియోగించాల్సిన సిలిండర్లు యమ స్మార్ట్ గా వాణిజ్య అవసరాలకు తరలిపోతున్నాయి.!! గృహ వినియోగదారునికి అందవలసిన పంట గ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని హోటల్స్, రెస్టారెంట్లకు దర్జాగా డొమెస్టిక్ సిలిండర్లు సరఫరా అవుతున్నాయి అన్న విషయాలు ఇక్కడ బహిరంగంగా వినిపిస్తున్నా పట్టించుకునే పరిస్థితి లేదు. గృహ వినియోగదారుడికి మాత్రమే వంట గ్యాస్ పొందాలంటే కష్టమైన పరిస్థితి… అయితే వాణిజ్య అవసరాలకు డొమెస్టిక్ గ్యాస్ పొందాలంటే ఏమాత్రం అయినా కష్టపడాల్సిన అవసరం లేదు అని ఇక్కడికి హోటల్స్ ను చూస్తే తెలుస్తుంది.

గృహ వినియోగదారుడు వంటగ్యాసును పొందాలంటే… ఆన్లైన్లో బుక్ చేయాలి… అందుకు నెలకు పైగా సమయం కావాలి….!! ఇదంతా ఓకే అనుకున్నప్పటికీ ఆన్లైన్లో గ్యాస్ కోసం బుక్ చేస్తే అది కొన్నిచోట్ల బుక్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదని వినియోగదారుల ద్వారా తెలుస్తోంది. ఆన్లైన్లో వంట గ్యాస్ బుక్ చేసుకోవాలన్న విషయం తెలియని ఎంతోమంది గ్యాస్ కోసం కష్టాలు పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. మరొక విషయం ఏమిటంటే…. ఎలాంటి ఆన్లైన్లో బుక్ చేయకుండా హోటళ్లకు రెస్టారెంట్లకు మాత్రం బ్లాక్ లో వంట గ్యాస్ సిలిండర్లు దర్జాగా వారి వ్యాపార కేంద్రాలకు తరలిపోతున్న అడ్డుకునే నాధుడు లేడు.

గృహ వినియోగానికి అవసరమైన వంటగ్యాస్కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్కు సరిపడా గ్యాస్ నిల్వలు ఉన్నాయని ప్రభుత్వాలు పదే పదే చెబుతున్నాయి. అయితే గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో గృహ వినియోగదారులకు మాత్రం వంటగ్యాస్ దక్కించుకోవడం కష్టతరంగా మారిపోయింది అనడంలో ఎలాంటి అతియోశక్తి లేదు. ఇక్కడ బ్లాక్ మార్కెట్లో వంటగ్యాస్ సిలిండర్ పొందాలంటే సుమారుగా 2500 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.

గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో వందల సంఖ్యలో హోటల్స్ ఉన్నాయి. వీటన్నింటికీ కమర్షియల్ సిలిండర్ మాత్రమే వినియోగించాలి అయితే అలా వినియోగిస్తున్న వారి సంఖ్య 10% కూడా కనిపించదు. మిగతా 90 శాతం స్ట్రీట్ సైడ్ హోటల్స్, కర్రీ పాయింట్స్ , చిన్న తరహా, పెద్ద తరహా హోటల్స్, రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్ల వాడకమే ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన నిజం. అయినప్పటికీ అక్కడ తనిఖీలు అంతంత మాత్రమే జరుగుతుంటాయి.

బ్లాక్ మార్కెట్లో సిలిండర్లు అమ్మకాలు జరగాకపోతే డొమెస్టిక్ సిలిండర్లు నగరంలోని హోటల్స్, రెస్టారెంట్లలో ఎలా ఉంటాయనేది ప్రశ్నించుకోవాల్సిన అంశం. ఎవరి ప్రమేయంతో వంటగ్యాస్ సిలిండర్లు పక్కదారి పడుతున్నాయి…!! ఇదంతా తెలిసిన అధికార యంత్రాంగం ఎందుకు తనిఖీలు చేపట్టడం లేదు..!! వంట గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న ఎందుకు అరికట్టడం లేదు..!! డొమెస్టిక్ సిలిండర్లను వినియోగిస్తున్న వ్యాపార కేంద్రాలపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నగరంలో సంబంధిత శాఖ అధికారులు మూకుమ్మడిగా విస్తృత దాడులు నిర్వహిస్తే హోటల్స్ రెస్టారెంట్లలో వందల కొద్దీ డొమెస్టిక్ సిలిండర్లు లభిస్తాయి అని తెలుస్తుంది. వంట గ్యాస్ సిలిండర్లు దర్జాగా పక్కదారి పడుతున్న పరిస్థితినీ అరికట్టాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది.

Leave a Reply